Thu07192018

Last update10:37:21 AM

Maggam & Zardosi works @ Rajanna Sircilla_03/01/2018

సాయిరాం, భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో,స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కార్యక్రమంలో భాగంగా BIRED సంస్థ వారి సహకారం తో మహిళలకు తే. 11-11-2017 నుండి 02-01-2018 వరకు నిర్వహించిన మగ్గం వర్క్స్ & జర్దోసి శిక్షణ  కార్యక్రమం విజయవంతంగా 45  రోజులు పూర్తి చేసుకొని తే.03.01.18.నాడు శ్రీ సత్య సాయి సంస్థ రాష్ట్ర మహిళా సమన్వయకర్త  శ్రీమతి సుధమ్మ, రాష్ట్ర సేవాదళ్ కో. ఆర్డినేటర్ శ్రీ.కృష్ణ కుమార్, రాష్ట్ర యూత్ ఇంచార్జి శ్రీ.నివేదిత, రాష్ట్ర జాయింట్ యూత్ కో.ఆర్డినేటర్ శ్రీ.మహేష్  మరియు  B.I.R.E.D అసిస్టెంట్ డైరెక్టర్ డా. రవీందర్ , ఇండియన్ బ్యాంకు డి.జి.ఎం. రామచందర్ రావు , మేనేజర్ బ్రహ్మయ్య గారిచే ముగింపు వేడుకలు  చేసుకోవట మైనది.

ఈ కార్యక్రమంలో 51 మంది  మహిళలు శిక్షణ తీసుకున్నారు.48 మంది గ్రామీణ అమ్మాయిలు, 3 మంది మందిరం దగ్గర లోని వారు పాల్గొన్నారు.ఉ.10.00గం. నుండి సా.5.00 వరకు 45 రోజులు వచ్చి శిక్షణ లో పూర్తి మెలుకువలు చక్కటి గురువు ద్వారా మహిళలకు కావల్సిన అన్ని వర్క్స్ నేర్చుకోవట మైనది.

 ఈ సేవా కార్యక్రమ ముగింపు వేడుకలు  జిల్లా అధ్యక్షులు శ్రీ. రవీందర్, మహిళా కో.ఆర్డినేటర్లు శ్రీమతి.వందన, శ్రీమతి మనోరమ మరియు జిల్లాలోని అన్ని సమితిల కన్వీనర్ లు శ్రీ.రాము, శ్రీ.వేణు, శ్రీ.సత్యనారాయణ,జిల్లా ఇతర పదాధికారులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలనుద్దేశించి అతిధి గ విచేసినటువంటి మునిసిపల్ కార్పొరేషన్ సిరిసిల్ల చైర్మన్ శ్రీమతి.పావని గారు,శ్రీమతి సుధా గారు  మాట్లాడుతూ నేర్చుకున్న దానిని అమలు చెయ్యాలని సిరిసిల్ల అంటేనే చేనేత అని ఆ రంగంలో మహిళల ద్వారా మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ఇందులో శిక్షణ పొందిన మహిళలు కూడా మాట్లాడుతూ ఈ అద్భుతమైన కార్యక్రమంలో శిక్షణ పొందినందుకు ఎంతో ఆత్మ విశ్వాసం కలిగించిందని తెలిపారు. చివరగా అర్హత ధ్రువీకరణ పత్రాలను  ప్రదానం చేసి కార్యక్రమాన్ని ముగించా.రు. 

45 రోజుల ఈ సేవా కార్యక్రమము లో ఎంతో మంది మహిళలు, సేవాదళ్యూత్ అమ్మాయిలుఅందరూ కూడా తమ విలువైన సమయం కేటాయించి కార్యక్రమం విజయం కావటానికి అన్ని విధాలా సహకరించట మైనది. అందరికి భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ సాయిరాం...

సదా సాయి సేవలో, జిల్లా అధ్యక్షులు శ్రీ. రవీందర్ రాజన్నసిరిసిల్ల జిల్లా..9908754587

Report by: Bandi Anil, IT Co-Ordinator, Rajanna Sircilla, Phone: 9533386667

Help lines:  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.  /  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

313233343536373839

News Coverage 

000

     

Activities
Youth Activities
Bala Vikas Activities