Fri01192018

Last update11:06:02 AM

శ్రీకాకుళం జిల్లాలో వాడ వాడల స్వామి వారి 91వ జయంతి వేడుకలు (23.11.2016)

శ్రీకాకుళం  జిల్లాలో వాడ వాడల స్వామి వారి 91వ జయంతి వేడుకలు (23.11.2016)

భగవాన్ శ్రీసత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లాలో స్వామి వారి 91వ జయంతి వేడుకలు యెంతో భక్తి శ్రధ్ధలతో ఘనంగా జరిగాయి. జిల్లాలోని 35 సమితులు, 188 భజనమండలిలులో  వివిద అధ్యాత్మిక కార్యక్రమాలు  సేవ కార్యక్రమాలు, గ్రామ సేవలు, మెడికల్ క్యాంపులు, ఆసుపత్రి సేవలు, జైల్ సేవలు, గర్భిణీ స్త్రీల  సేవలు, వృద్ధుల సేవలు జరిగాయి. వీటితో పాటూ సుమారు 900 గ్రామాలలో ప్రతి గ్రామం లోనూ  మహా నారాయణసేవలు/అన్న సంతర్పణలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,00,000 మంది స్వామి వారి ప్రసాదం కోసం నారాయణ సేవలో పాల్గొన్నారు. జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు గారు మరియు బృందం తే23.11.2016ది నాడు వివిద గ్రామాలు పర్యటించారు. కోటబొమ్మాళి సమితిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రి వర్యులు శ్రీ కె. అచ్చెన్నాయుడు గారు పాల్గొన్నారు. జిల్లా కలక్టరు శ్రీ పి. లక్ష్మి నరసింహం గారు శ్రీకాకుళం లోని సాయి గణేష్ మందిరం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో సంబందిత గౌరవ శాసన సభ్యులు, వున్నతాధికారులు  ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

కొన్ని అత్యంత ప్రత్యేకాంశములు

  1. శ్రీకాకుళం పెద్ద మందిరం వరుస 9 దినములు 9 గ్రామాలలో గ్రామ సేవలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోను 91 మందికి దుస్తులు, ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరం, ప్రతి ఇంటికి ఒక లడ్డు, పులిహోర, విభూతి, స్వామి వారి ఫోటో పంపిణీ చేశారు. గ్రామ సేవలో జరిగిన పల్లకి ఉత్సవంలో రాస్త్ర ఉపాద్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు మరియు జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు పాల్గొన్నారు.
  2. శ్రీకాకుళం న్యూ కాలనీ మందిరం వారు స్వామి జయంతి రోజున 910 దుప్పట్లు పంపిణి చేశారు.
  3. యూత్ డే నాడు జరిగిన మహా నగర సంకీర్తనలో సోంపేట మందిరంలో అత్యధిక యువజనులు పాల్గొన్నారు.
  4. తే17.11.2016ది నాడు సారవకోట మండలంలో  చినమల్లిపురం అనే మారుమూల ట్రైబల్ కుగ్రామంలో పూర్తిగా గ్రామస్తుల శ్రమదానంతో నిర్మించిన ఖరీదైన సత్యసాయి మందిరాన్ని జిల్లా అద్యక్షుల వారు ప్రారంభించారు.
  5. తే20.11.2016ది నాడు  పాలకొండ మండలంలో SSSVIP గ్రామం ఓని  గ్రామంలో గ్రామస్తుల శ్రమదానంతో నిర్మించిన  సత్యసాయి మందిరాన్ని జిల్లా అద్యక్షుల వారు ప్రారంభించారు.
  6. తే20.11.2016ది నాడు  పాలకొండ లో అత్యంత వైభవంగా రథోత్సవం, స్వామి వారి వురేగింపు, బండ్ల వేషాలు, కోలాటం, ఒరిస్సా భజన్స్ తో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఇన్చార్జ్  శ్రీ గురు ప్రసాద్ మరియు శ్రీ యం. జనార్ధన్ పాల్గొన్నారు.
  7. పాలకొండ మందిరంలో తే23.11.2016ది నాటి మహా నారాయణ సేవలో అత్యధికంగా 10,000 మందికి పైబడి పాల్గొన్నారు.

కొన్ని ఫోటోలు, పేపర్ అంశాలు స్వామి వారి పాదాల  చెంత సమర్పించడ మైనది

Report by: R.Kishor, Dist. IT incharge, Srikakulam, Phone 8332041839

1 sairam

image 4

image 8

1111 image

13 blankets distribution

2 sairam

anna daanam

4 sairam

6 sairam

7 sairam

8 sairam

9 sairam

10 sairam

11 sairam

12 sairam

15 sairam

16 sairam

 

18 sairam

19 sairam

20 sairam

21 sairam

22 sairam

23 sairam

 

 

Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Activities
Youth Activities
Bala Vikas Activities